Sunday, November 29, 2009

నీ కోసం

నేను వెదుకుతున్నాను

మస్తిష్కం లోని అన్ని మలుపుల గుండా

గుండె కవాటాల్లోను, మనసు పొరల మధ్యా

నేను వెదుకుతున్నాను

పనులతో నిండిన పగళ్ళు, నిదుర తో నిండిన రాత్రుల్లోను

అందమైన సాయంత్రాల్లో అన్ని సమయాల్లోనూ

నేను వెదుకుతున్నాను

చిర పరిచిత ముఖాల్లోనూ, ప్రతి నవ్వు లోను

క్రొత్త మనుషుల లోనూ అన్ని కోణాల్లోనూ

నేను వెదుకుతున్నాను

నా లోను నీ లోనూ అన్నిట్లోనూ

నా ఉనికే నీ ఆచూకి అని తెలిసీ

నిన్ను పూర్తిగా తెలుసుకోలేక పోతున్నాను అందుకే

నేను వెదుకుతున్నాను

అజరామరుడవు ఆర్తత్రాణ పరాయణుడవు అయిన

అనుక్షణం నన్ననుగ్రహించే

నీ కోసం

Tuesday, November 24, 2009

శ్రీనాధుడన్

"కుళ్ళాయుంచితిఁ కోక చుట్టితి మహా కూర్పాసముం దొడ్వితిన్
వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా
చల్లనంబలి ద్రావితిన్ రుచులు దోసంబంచు పొగడితిన్
తల్లీ! కన్నడ రాజ్య లక్ష్మీ దయ లేదా? నేను శ్రీనాధుడఁన్ !!"



కొన్ని గొప్ప పద్యాలు

ఏ వేదంబు పఠించె లూత, భుజగంబే శాస్త్రముల్సూచె
తానేవిద్యాభ్యసనంబొనర్చెకరి, చెంచేమంత్రమూహించె
బోదావిర్భావ నిధానముల్ చదువులయ్యా, కావు, నీ పాద
సంసేవాసక్తియే కాక జంతు తతికిన్ శ్రీకాళ హస్తీశ్వరా

ధూర్జటి



సిరి గల వానికి చెల్లును

తరుణులు పదియారువేలు తగ పెండ్లాడన్

తిరిపెమున కిద్దరాండ్రా!

పరమేశా, గంగ విడుము పార్వతి చాలున్.


శ్రీనాధుడు

Thursday, November 19, 2009

నాకు నచ్చిన పదాలు

వసంతం పిండి గొంతులో వార్చినందుకు, పాట పంచుతూ

కోయిల తోటకు విందు చేస్తోంది;

విశ్వాన్ని వండి విస్తట్లో వడ్డించిన, నీ కోసం ఒక్క పాట కూడా

పాడలేని నన్ను వెక్కిరిస్తూ.

ఆంధ్రప్రభ
కవి పేరు: రాజు
this is for u adithya,
and for those who can't read Telugu
not a justified translation but i'm trying to convey the message in it.
बसंत के बदले में कोयल अपना गाना बाँट रही हैं बगिया से
मुझे शर्मिन्दा करते हुए की
सारी विश्व को मेरी थाली में भरने वाले के नाम मैंने एक भी गाना गा न सका

Tuesday, November 17, 2009

My pet name

For those few individuals on this earth,
that know me by my pet name
call me and refer to me by my pet name
you get to touch that special sensitive corner in my heart.
i know that
if i'm lost, i should find you first
so i get back to myself and rest
i know that
i owe you more than i know
yet again i'd ask you a favour
to be there and be there for ever

Saturday, November 14, 2009

ajji i miss you ajji i love you

అజ్జీ

మా అజ్జీ

నా ప్రియాతి ప్రియమైన అజ్జీ....

దైవ సమానమైన మీరు

మీ రూపం మీ మనస్తత్వం మరీ ముఖ్యంగా

మీ బోసినవ్వు

అపురూపం

అనాదిమధ్యాంత రహితం

అజ్జీ

ఈ వెలుగునీడల దాగుడుమూతల ఆట లో

మీ అడుగు జాడల లో నడుస్తున్నానో లేదో

మీరు నేర్పిన ఆట పాటలు భావి తరాలకి అందజేస్తున్నానో లేదో

నాదైన ప్రతి మెరుగూ మీరు మలచినదే

నాకు నేను న్యాయం చేస్తున్నానో లేదో

కానీ

మీరు పంచిన ప్రేమ,

మీ జ్ఞాపకాలూ మాత్రం

మది నిండా నింపుకున్నాను

మనం మళ్ళీ కలిసినపుడు

మరోసారి మీతో పంచుకుంటాను

Friday, November 13, 2009

వ్యత్యాసం

తెల్లవారుతూనే నిద్ర మేల్కొన్నాను

హడావిడిగా దినచర్య మొదలుపెట్టాను

ఎన్నో పనులున్నాయి ఎంతో సాధించాలి ...

భగవంతుని ధ్యానానికి సమయం దొరకలేదు

ఇబ్బందులు ఇబ్బడి ముబ్బడి గా వచ్చిపడ్డాయి

ప్రతి పనీ పెను భారం గా మారింది

"భగవంతుడా నాకెందుకు సాయం చెయ్యవు?" అని అనుకున్నా

"నువ్వు అడగలేదు మరి" ఆయన సమాధానం

సంతోషం సౌందర్యం కోసం నేను చూస్తుంటే

రోజంతా స్తబ్దుగా పేలవంగా గడిచింది

వాటిని నాకెందుకు చూపించవు భగవంతుడా అన్నా

"నువ్వు వెదుకలేదు మరి" ఆయన ప్రత్యుత్తరం

ఆయన సన్నిధి చేరడానికి తలుపు దగ్గర

అన్ని రకాల తాళాలు వాడాను, తెరుచుకోలేదు

తనదైన చిద్విలాసంతో భగవంతుడు

"నువ్వు తలుపు తట్టలేదు మరి" ఆయన జవాబు

తెల్లవారుతూనే నిద్ర మేల్కొన్నాను

హడావిడి గా దినచర్య మొదలుపెట్టే ముందు ఒక్కసారి ఆగాను,

ఎన్నో పనులున్నాయి ఎంతో సాధించాలి...

భగవంతుని ధ్యానానికి ఇదే సరైన సమయం.

ఆంగ్ల మూలం

స్వర్గీయ శ్రీ ఈశ్వరదత్తు గారు

అనువాద ప్రయత్నం

అశ్రు నయనాలతో.

Thursday, November 12, 2009

ఇదేదో భలే ఉంది. తెలుగు లో బ్లాగ్..

ఏ ఆలోచన ఎప్పుడు ఎవ్వరికి వచ్చినదైనా

అంతకు ముందే ఇంకెవరికో వచ్చే ఉంటుంది అని

ఎవరో అన్నట్లు, విన్నట్లు గుర్తు. అది నిజమే

ఐతే

నా ఈ ఆలోచనలని ఇలా బైట పెట్టటం...

సరదాగా అనిపిస్తోంది నాకు. విన్నవారు చదివిన వారు జుట్టు పీక్కోక మానరు.

అయినా

లోకం లో ఎన్ని తప్పుల తడకల తిక్కల తింగరి ఆలోచనలు లేవు?

మీకూ తెలుసు కదా....

అలాంటి వాటితో పోల్చదగని

చక్కని మామూలు ఆలోచనలు నావి.

బుర్రలో నడిచేదాన్ని అక్షర రూపం లో అందం గా

కాకపోయినా పొందిక గా అమర్చటం ఒక కళ

ప్రయత్నిస్తున్నందుకే పొంగిపోతున్నాను

ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను

ఇదేదో భలే ఉంది. తెలుగు లో బ్లాగ్...


Monday, November 9, 2009

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే