Friday, July 22, 2011

A Thursday Poem -- by Jahnavi.Uppaluru

Today is Thursday, I think it's a think day!
Tomorrow is Friday, And thats so fun day!


The days of the week are all very neat but 
Friday just happens, to be my favorite One!

Wednesday, July 13, 2011

Tuesday, July 5, 2011

ఏకం సత్ --- ఆప్త చైతన్య (ఆంధ్రప్రభ 25 -1 -1999 )

నేను నిన్ను కోపంగా చూస్తే 
నువ్వు మాత్రం జాలిగా చూస్తావు -
వయసు ముదిరినా జ్ఞానం రాలేదని!

నేను నిన్ను ఆటబొమ్మగా చూస్తే 
నువ్వు మాత్రం అమ్మలా చూస్తావు-
ఎంత నేర్చినా చపలత్వం పోలేదని!

నేను నిన్ను కోరికతో చూస్తే 
నువ్వు మాత్రం ఆరాధనగా చూస్తావు-
వ్యర్ధం వెనుక అందమైన రూపముందని!

నేను నిన్ను ద్వేషం తో చూస్తే 
నువ్వు మాత్రం ప్రేమగా చూస్తావు-
నేను గాయమై పతనమైపోకుడదని!

నేను నిన్ను నిన్ను గా చూస్తే
నువ్వు మాత్రం నన్ను నీవుగా చూస్తావు-
రూపాలు వేరైనా మనమొకటేనని !