Thursday, August 4, 2011

నా సినీవాలి, I love you Baba...

తండ్రి : నువ్వు కోరుకున్న సంగీతం 
          నీ ఒక్కడి చెవులకే ఆనందం 
          నువ్వు వేసుకొన్న చిత్తరువు 
          నీ ఒక్కడి కళ్ళకే అచ్చెరువు 
          నీ జన్మకి కారకుడిని 
          నీ మెదడుకి మెకానిక్కుని
          నీ ఊపిరికి పరబ్రహ్మని 
          నీ ఆనందానికి నేనే
          వ్యాసకర్తనైతే బాగుంటుంది 
          నువ్వు ఆనందించడానికి 
          అప్పుడే కొంచెం వీలుంటుంది 

బిడ్డ : అప్పుడు వినలేదు, క్షమించండి 
         ఇప్పుడు వింటాను, మన్నించండి 
         నా భూత, వర్తమాన, భవిష్యత్ గారూ
         నా బాబా, మీరే నా సినీవాలి 
         మీ పలుకులు వేదంలా నన్ను తీర్చి దిద్దుతాయి 
         నా బ్రతుకు రైలుబండికి మీరే గార్డు  
         నేను పట్టాలు తప్పినా
         మీరు మీ మాటలతో నన్ను మళ్ళా నిలబెడతారు
         నేను సమర్ధవంతంగా ఉండేలా నన్ను నడిపిస్తారు  
         నన్ను జయం అనే గమ్యం చేరుస్తారు 
         మీరు చెప్పేవన్నీనా బ్రతుక్కి నిర్దేశకాలు, అందుకే 
         మీరు చెపుతూ ఉండండి...నేను బ్రతికేస్తూ ఉంటా...

1 comment:

  1. Hi Baba maatallo. nnaku telusu nuvvu ila rastavani. fine. nenu chepputoo untanu. nuvvu vintune undu.

    ReplyDelete