Wednesday, December 14, 2011

re-post




నా స్థిరాస్తులు 
తెల్లవారుజామున చలిలో, వాళ్ళింటి  డాబా మీద 
మా మాస్టారుగారు నేర్పించిన లెక్కలు 
స్కూల్ లో టీచర్ల దగ్గర పొందిన గారాబాలు 
సైకిల్ మీద రయ్యిన దూసుకుపోతుంటే 
తోడు ఒచ్చిన నేస్తాలు 
ఇంటా బయటా మేము చెప్పుకున్న కబుర్లు, ఆడిన ఆటలు,
చేసిన అల్లర్లు
హిందీ tuition లో నేర్చిన పాఠాలతో పాటు నవ్విన నవ్వులు 
సాయంత్రాలు మేడ ఎక్కితే కనబడే గోదావరి తళతళలు
సంక్రాంతి ముగ్గులు 
మరీ ముఖ్యంగా 
మమ్మీబాబాల మధ్యలో చెక్కబల్ల మీద కూర్చుని 
తిరిగిన రిక్షా షికార్లు 
మనసు బ్యాంకు లో పదిలంగా దాచుకున్న 
నేను ఎప్పటికీ గర్వంగా చెప్పుకునే  
నా స్థిరాస్తులు 

No comments:

Post a Comment